ఎల్లారెడ్డిలో మూడో రోజు కొనసాగిన రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు

ఎల్లారెడ్డి గౌడ్స్ గల్లీలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని - చింతల పోచమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఆదివారం మూడవ రోజు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ప్రాతఃకాల పూజ, కాలపూజ, హోమాదులు, గర్తన్యాసం, యంత్ర మూర్తి స్థాపన, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన, బలి, పూర్ణాహుతి, రుత్విక్ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలు ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ బోనాల ఊరేగింపు కూడా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్