అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేసిన రెవిన్యూ పోలీస్ అధికారులు

నాగిరెడ్డిపేట మండలంలోని చీనుర్, వాడి గ్రామాలలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక కుప్పలను స్థానిక ఎస్ఐ భార్గవ్ గౌడ్, ఆర్ఐ మహేష్ చంద్ర గుర్తించి సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఇసుకను తీసి నిల్వ చేయడం, తరలించడం నేరమని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటన మంజీరా పరివాహక ప్రాంతంలో చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్