ఎల్లారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి

ఎల్లారెడ్డి పట్టణ శివారులోని మీసాన్ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం. ఎల్లారెడ్డి నుంచి బిక్కనూర్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఏగొండ(18) అనే యువకుడు తన వాహనాన్ని చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్