కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి, రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పల్లెల స్వరూప ఇంట్లో 2 తులాల బంగారం, 30 తులాల వెండి, ఎం. ప్రవీణ్ గౌడ్ ఇంట్లో 10 తులాల వెండి, నగదు, అంజవ్వ ఇంట్లో 18 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మిగతా రెండు ఇళ్లలో చోరీ జరగలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మధుసూదన్, రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ పరిశీలించారు.