లింగంపేట మండలం ఎల్లమ్మ తండా సమీపంలోని ఖందకాల ప్రాంతంలో ఉన్న చారిత్రక రాతి చిత్రాలను పరిరక్షించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రాతి చిత్రాలను పరిశీలించి వాటి చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకున్నారు. సందర్శకులకు సౌకర్యాలు, సమాచార బోర్డులు ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీవోను సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సురేందర్, ఎంపీడీవో ప్రవీణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.