లింగంపల్లి ఖుర్డు హై లెవల్ బ్రిడ్జికి రూ. 8. 5 కోట్లు మంజూరు

ఎల్లారెడ్డి సెగ్మెంట్ కామారెడ్డి - ఎల్లారెడ్డి రహదారిలో గత వర్షాలకు కొట్టుకుపోయిన లింగంపల్లి ఖుర్దు, అడివిలింగాల హై లెవల్ బ్రిడ్జిల పునఃనిర్మాణానికి రూ. 8.5 కోట్లు మంజూరు అయ్యాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. నిధులు విడుదల కావడంతో ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పాత్ర అభినందనీయమని ప్రజలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్