ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం రాష్ట్రీయ ఏక్త దివాస్, ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో "రన్ ఫర్ యూనిటీ" (2 కే రన్) నిర్వహించారు. స్థానిక ఎస్ఐ. ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ లో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులను, ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ. సందేశాన్ని వినిపించారు.