గర్భిణీస్త్రీల ఆరోగ్య రక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమం

గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమాలు కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ అన్నారు. బుధవారం "ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో" భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా, కలెక్టరేట్లో సురక్షిత మాతృత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తల్లి, శిశు ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైన అంశమని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ప్రసూతి సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్