తాడ్వాయిలో ఘనంగా సావిత్రీబాయి పూలే జయంతి

తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సావిత్రి బాయి పూలే 194 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా విద్య కోసం కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి చిత్ర పటానికి ప్రిన్సిపాల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్, అద్యాపకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహిళల అభ్యున్నతి కోసం, అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధి కోసం పూలే కృషి అమోఘమని ప్రన్సిపాల్ అన్నారు.

సంబంధిత పోస్ట్