రాజంపేట మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్ల నర్సింలు ప్రభుత్వ అనుమతి లేకుండా కాలువల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో, రాజంపేట ఎస్ఐ. బొజ్జ మహేష్ వెంటనే స్పందించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం లేదా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.