ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారులలో తల్లితండ్రులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని, ఎల్లారెడ్డి ఎంఈఓ ఎల్. రాజులు సూచించారు. సోమవారం స్థానిక భవిత భవనంలో తెలంగాణ సర్వ శిక్షాభియాన్ వారి సహిత విద్యలో భాగంగా, ప్రభుత్వం ద్వారా శారీరక దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న వారానికి 2 సార్లు సోమవారం, గురువారం నాడు ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు.