సీనియర్ నేత గోవింద్ రెడ్డి మృతి

ఎల్లారెడ్డి మండల సీనియర్ నేత, రుద్రారం గ్రామ నివాసి గోవింద్ రెడ్డి (70) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈ నెల 12న రుద్రారం గ్రామంలో జరుగుతాయని కుటుంబీకుడు ప్రతాప్ రెడ్డి తెలిపారు. విదేశాల్లో ఉన్న గోవింద్ రెడ్డి కూతురు, మనవలు, మనవరాళ్ల రాక కోసం ఆయన పార్థివదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచనున్నట్లు వెల్లడించారు. గోవింద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేసి, అనంతరం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్‌తో కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలోనూ పనిచేశారు.

సంబంధిత పోస్ట్