ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్ఐ

ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్‌పేట జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఎస్ఐ. భార్గవ్ గౌడ్ సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల వస్తువుల భద్రతకు సరైన సౌకర్యం లేకపోవడాన్ని గమనించి, పోలీసు భద్రతా సిబ్బంది వద్దే వస్తువుల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్