ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పాటకుల దివ్య భారతి శుక్రవారం నామినేషన్ దాఖల్ చేశారు. తన భర్త, ఎల్లారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వినోద్ గౌడ్ తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. గతంలో ఇదే 7వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ సొసైటీ వైస్ చైర్మన్ తల్లి మత్తమాల భాగ్యవతి కూడా నామినేషన్ దాఖల్ చేయడం విశేషం.