సర్ ఫామ్స్ ఇస్తున్నారు.. నింపే ప్రక్రియ చెప్పడం లేదు

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇంటింటికి బిఎల్ఓలు ఫారాలు ఇస్తున్నప్పటికీ, వాటిపై అవగాహన కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ జడ్పీటీసీ గయాజొద్దీన్, మైనార్టీ నేతలతో కలిసి స్థానిక తహసీల్దార్ ప్రేమ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. బిఎల్ఓల ద్వారా 'సర్' ఫారాలు నింపే ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల ప్రజలకు ఇబ్బందులు తొలగి, సరైన అవగాహన లభిస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్