స్వప్నలోక్ లో ఘనంగా సీతారామ కల్యాణం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీహర్ష తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం అఖండ నామము, సుప్రభాతసేవ, మూల విరాట్లకు, ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, మంగళస్నానం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్