ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం వద్ద హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉక్కల్కర్ సంతోష్ కుమార్ అన్నప్రసాదం (బిక్ష) ఏర్పాటు చేశారు. నగేష్ గురుస్వామి పూజలు నిర్వహించి, స్వాములకు అన్నప్రసాదం, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు చాబ్దరం గురుస్వామి, కోశాధికారి ఈశ్వరగౌడ్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.