తల్లి చనిపోయిందని కుమారుడి ఆత్మహత్య

బాన్సువాడ సెగ్మెంట్ రుద్రూర్ మండలం రాయకూరుకు చెందిన దర్జీ శ్రీకాంత్ (26) తన తల్లి మరణంతో మనోవేదనకు గురై, గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ. సాయిలు శుక్రవారం తెలిపారు. నెల రోజుల క్రితం శ్రీకాంత్ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో అప్పటి నుంచి అతను మనస్థాపానికి గురైనట్లు చెప్పారు. ఈ నెల 27న శ్రీకాంత్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్