మెల్లకుంట తండాలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, స్థానిక నాయకులు, రైతుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. రైతులు తమ పంటను క్వింటాల్‌కు రూ. 3,699 మద్దతు ధరకు విక్రయించి లబ్ధి పొందాలని, దళారుల వద్ద అమ్మి నష్టపోవద్దని చైర్మన్ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.