ఎల్లారెడ్డి మండలంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిత సెంటర్‌లో బుధవారం సి డబ్ల్యు ఎస్ ఎన్ పిల్లలకు ఘనంగా క్రీడలు నిర్వహించారు. మండల విద్యాధికారి ఎల్ రాజులు క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఎంఈఓ వికలాంగుల సంక్షేమ పథకాలు, ఉపకరణాల పంపిణీ, వివిధ రకాల వైకల్యాలపై వివరించారు. అనంతరం, ఎంపీడీఓ విజేతలకు తల్లిదండ్రుల సమక్షంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ అరుణ్, ఐఈఆర్టీ వెంకటేశం పాల్గొన్నారు.