ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు ఇందిరానగర్ లో ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలా ఊరేగింపు ఘనంగా జరిగింది. ఇంటింటికి ఒక మహిళ బొనం ఎత్తుకొని బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పు సన్నాయిలతో బోనాల ఊరేగింపుగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు సాగింది. చివరన అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనాల కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.