నిజాంసాగర్ మండలం బంజపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ చారి, మంగళవారం బీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.