ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నామని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో కలెక్టర్ పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం, రెండు జతల యూనిఫారంలు, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు. డీఈఓ రాజు వున్నారు.