విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవాలి

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ శనివారం మాట్లాడుతూ, విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న 'అన్న-అక్క' డిజిటల్ మెంటర్‌షిప్ శిక్షణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 77 ప్రభుత్వ పాఠశాలలకు 105 మంది విద్యార్థులను కేటాయించారని, పి- జామ్ ఫౌండేషన్ సాంకేతిక సహకారంతో డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్