బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినుల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య రంగంలో సేవలందించాలని ఆయన విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ వేడుకలు భారత్ గార్డెన్స్ లో శనివారం జరిగాయి.