ప్రమాదవశాత్తు చెయ్యిని కోల్పోయిన యువకునికి పైడి అండ

ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ కు చెందిన రాజారామ్ అనిల్ కుమార్ (32) అనే యువకుడు గడ్డికట్టర్లో చేయి కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతని పరిస్థితిని లింగంపేట మండల బీజేపీ అధ్యక్షులు బొల్లారం క్రాంతి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, అనిల్ కుమార్ ను హైదరాబాద్ కు పిలిపించి, తన సొంత ఖర్చులతో బైక్ నడిపేందుకు, వస్తువులు పట్టుకునేందుకు వీలుగా ఫైబర్ చేతిని అమర్చారు. అనిల్ కుమార్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ఆకుల కిష్టయ్య కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్