కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి ఎక్స్ రోడ్డులోని స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ వద్ద శనివారం బైక్, ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాంధారి నుంచి వస్తున్న ట్యాంకర్ ను బైక్ ఢీట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, ట్యాంకర్ డ్రైవర్ 108కి సమాచారం అందించారు. సదాశివ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్త వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్