నాగిరెడ్డిపేటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

సోమవారం నాగిరెడ్డిపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మధ్య దళారులు లేకుండా ప్రతి పేదవాడికి అందాయని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి, ఆరు గ్యారంటీలు ఇస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, మూడు సంవత్సరాలు గడుస్తున్నా చేసిందేమీ లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్