అమరవీరుల ఆత్మత్యాగల ఫలితమే తెలంగాణ: ఎస్పీ

అమరవీరుల పోరాటం, ఆత్మత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్