పేదోని సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో సాధ్యo

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 10, 12 వార్డుల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. పేదల సొంత ఇంటి కలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా సాధ్యం చేస్తామని చైర్మన్ అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాములు, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్