మొరాయించిన ఉపాధి హామీ యాప్... వెనుదిరిగిన కూలీలు

సోమవారం నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లి, వదలపర్తి, పోచారం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సాంకేతిక లోపం కారణంగా హాజరు నమోదు కాలేదు. ఉదయాన్నే పని ప్రదేశానికి చేరుకున్న కూలీలకు హాజరు వేసే మొబైల్ యాప్ పనిచేయకపోవడంతో, ఫోటో క్యాప్చరింగ్ విధానంలో లోపం తలెత్తింది. ఎంత ప్రయత్నించినా హాజరు నమోదు కాకపోవడంతో, గంటల తరబడి నిరీక్షించిన కూలీలు నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లారు. ప్రభుత్వం ప్రతిరోజూ ఉపాధి హామీ పనులకు వెళ్లి జీవనోపాధిని పెంపొందించుకోవాలని సూచిస్తున్నప్పటికీ, యాప్ పనిచేయకపోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్