ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, కార్మికుల కష్టమే దేశ ప్రగతికి పునాది అని అన్నారు. శుక్రవారం మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రంగంలోనూ శ్రమజీవులు తమ చెమటతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మే డే సందర్భంగా ప్రతి కార్మిక సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ఈ మే డే ప్రతి ఒక్కరికీ కొత్త ఉత్సాహం, భరోసా తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.