ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసి సహాపంక్తి భోజనం చేసిన మంత్రి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా, మంగళవారం కామారెడ్డి మండల కేంద్రంలోని గూడెంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆమె ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులకు చీర సారె అందించారు. అనంతరం రాత్రి లబ్ధిదారులతో కలసి మంత్రి సీతక్క సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్