పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించడం కోసమే ఎస్ ఐ ఆర్ ప్రక్రియ

ఎల్లారెడ్డి ఆర్టీవో ప్రభాకర్ ఆదివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని పోలింగ్ నెంబర్ 252 లో బి ఎల్ ఓ ఎన్యుమరెషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించడం కోసమే కేంద్రీయ ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ సర్వే కోసం వచ్చే బిఎల్ఓ లకు సహకరించి, పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీకి తోడ్పడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో పారదర్శక ఓటరు జాబితా అవసరమని నొక్కి చెప్పారు. ఈ ప్రక్రియ జులై 24 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్