పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను చేపట్టిందని ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆర్. ప్రభాకర్ తెలిపారు. శనివారం ఎల్లారెడ్డి మండలం జంగమాయిపల్లి పోలింగ్ బూత్ నంబర్ 257లో బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించారు. ఆర్డీఓ, తహశీల్దార్ ప్రేమ్ కుమార్, ఎఎంసి చైర్ పర్సన్ మారెడ్డి రజిత వెంకట్ రెడ్డి దంపతుల నుంచి పూర్తి చేసిన ఫారంను బిఎల్ఓలతో కలిసి స్వీకరించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ సర్వే కోసం వచ్చే బిఎల్‌ఓలకు సహకరించి, పారదర్శక ఓటర్ జాబితా తయారీకి తోడ్పడాలని ఆర్డీఓ సూచించారు.