కామారెడ్డి: ఆలయ హుండీ పగుల కొట్టిన దొంగలు

ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండాలోని జగదాంబ మాత, సేవాలాల్ ఆలయాలు హుండీని శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లి ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఆలయం హుండీ కనిపించకపోయేసరికి తండావాసులు బయటపడి, హుండీ చూసి, దాదాపు హుండీలో 30వేలకు పైగా డబ్బును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్