ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పొతంగల్ మండలం కొడిచర్లకు చెందిన సాయికుమార్ (18), జక్రాన్ పల్లి మండలం పడకల్ కు చెందిన తలారి నరేందర్ (35) ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందగా, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం 161 జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నారాయణ పవార్ (40) ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.