శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయంలో స్పర్శ దర్శనం

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభోత్సవ సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతాయి. బుధవారం అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా, మంగళవారం ఉదయం నుండి భక్తులకు స్పర్శ దర్శనం కల్పించారు. ఆలయ ధర్మకర్త రవిగౌడ్ మాట్లాడుతూ, విగ్రహ దోష పరిహారం, శుద్ధి, నేత్రోన్మీలనం చేసి వేలాది మందికి స్పర్శ దర్శనం కల్పించామని, సాయంత్రం 6.30 గంటలకు ప్రతిష్ట ఊరేగింపు ఉంటుందని, నాలుగు రోజులు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్