సీఎం. రేవంత్ రెడ్డిని కలిసిన టిపిసిసి జనరల్ సెక్రెటరీ

గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో, కామారెడ్డికి చెందిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సకల జన సంక్షేమ రాష్ట్రంగా, అభివృద్ధికి కేంద్రంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శంగా నిలవాలని, నాలుగు కోట్ల ప్రజల సహకారంతో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పనిచేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్