మహమ్మద్ నగర్ కు చెందిన రాజేశ్వర్ రెడ్డి తన ట్రాక్టర్ ద్వారా గునుకుల్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ సాగర్ కెనాల్ నుండి ఎల్లారెడ్డి మండలం, అన్నసాగర్ మీదుగా అజంబాద్లో అధిక ధరలకు ఇసుక అమ్మడానికి తీసుకెళ్తున్నారన్నా సమాచారం మేరకు బుధవారం ట్రాక్టర్ తో పాటు డ్రైవర్ విజయకుమార్ ను అన్నాసాగర్ వద్ద పట్టుకున్నట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసునమోదు చేశామన్నారు.