భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంలో భాగంగా, ఫారం-6, ఫారం-7, ఫారం-8ల వినియోగంపై అధికారులకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, అర్హత లేని/మరణించిన వారి పేర్ల తొలగింపునకు ఫారం-7, ఓటర్ల వివరాల మార్పులకు ఫారం-8 ఉపయోగించాలని వివరించారు.