నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్ పూర్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల (SHG) నిరక్షరాస్య సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్ పథకం కింద ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు 18 సంవత్సరాలు పైబడిన మహిళా సభ్యులందరికీ చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు నేర్పించి అక్షరాస్యులుగా మార్చేందుకు ఉద్దేశించబడ్డాయి. ఆదివారం పంచాయతీలో SHG అధ్యక్షురాలు ఐకెపి VOA మేడికుంది మల్లేశం ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించబడింది. ఈ కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతోంది.