కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ శివాని రాజేందర్, గురువారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, తమ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కాంగ్రెస్ లో చేరినట్లు సర్పంచ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్