కలెక్టరేట్ లో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి వేడుకలు

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ ఆదివారం మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని అన్నారు. వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ వడ్డె ఓబన్న బ్రిటిష్ పాలకులను గడగడలాడించారని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్