ఎల్లారెడ్డి లో ఘనంగా వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు

శ్రీశ్రీశ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదిన వేడుకలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మహిళలు ఆదివారం ఉదయం కలశాల రేగగింపు నిర్వహించారు. పట్టణంలోని శివాలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై, మార్కెట్ మీదుగా వైశ్య భవన్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలను ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, 8వ వార్డు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్, జిల్లా ప్రతినిధి కంచచర్ల కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్