అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం వాహనంలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కేకే తండా గ్రామానికి చెందిన లావుడియా శ్రీనివాస్ అనే వ్యక్తి ఉప్పల్, హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ప్రజల వద్ద నుండి తక్కువ ధరకు పిడిఎస్ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, నిజామాబాద్, బోధన్ ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడన్న సమాచారంతో పట్టుకున్నట్లు ఎస్ఐ. తెలిపారు.

సంబంధిత పోస్ట్