ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామానికి చెందిన సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల గ్రామంలోకి దారి తప్పి వచ్చిన మరాఠీ భాష మాట్లాడే సుభాష్ అనే వ్యక్తిని గుర్తించి, గ్రామస్తుల సహకారంతో ఆయనకు స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి, భోజనం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.