ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా విజయలక్ష్మి

ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి మహిళా కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు విద్య రవికుమార్ తెలిపారు. అధ్యక్షురాలిగా నామ విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా మ్యాతరి సుజాత, శేర్ల రూప, ప్రధాన కార్యదర్శిగా లాస్య, కోశాధికారిగా మానస, కార్యదర్శులుగా గాయత్రి, మాలతి, లలిత, మమతలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్