అక్రమంగా ఇసుక టిప్పర్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

బిచ్కుంద మండలం గుండెనెమలి గ్రామంలో అక్రమంగా టిప్పర్ లారీలలో ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు బుధవారం రాత్రి లారీలను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలిపివేసి, టిప్పర్ లారీలను సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్