ఏప్రిల్ 2 నుండి ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో వార్డు సభలు

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గురువారం 99 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు వార్డు సభలు జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభల్లో వార్డు సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవశ్యకత వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రజలు వార్డు సభలకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్